Take a fresh look at your lifestyle.

కేతేపల్లి గ్రామ వాసి వెంకటేష్ గౌడ్ కు డాక్టరేట్

ముద్ర,పానుగల్: పానుగల్ మండలం కేతేపల్లి గ్రామానికి చెందిన వర్ధన్ గౌడ్,కృష్ణమ్మ దంపతుల కుమారుడు వెంకటేష్ గౌడ్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టా పొందారు.ఉస్మానియా యూనివర్సిటీ నుండి వృక్షశాస్త్రంలోడ్రాగన్ ఫ్రూట్ యొక్క శాఖీయ ప్రత్యుత్పత్తి, మరియు ప్రథమ ,ద్వితీయ జీవక్రియలు,జన్యు వైవిధ్యం గూర్చి పరిశోధన చేశారు.ఈ అంశం పై ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.S.కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో PhD పూర్తి చేశారు.ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో పిఎంఆర్ కళాశాలలో ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహిస్తున్నారు.పీహెచ్డీ పట్టా పొందిన వెంకటేష్ గౌడ్ ను గ్రామస్తులు,కుటుంబ సభ్యులు,స్నేహితులు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.