Take a fresh look at your lifestyle.

ఘనంగా వాసవీమాత జన్మదిన వేడుకలు

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జన్మదిన ఉత్సవాలలో భాగంగా నవరాత్రులలో శనివారం ఎనిమిదవ రోజు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఆమెడ శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నగర సంకీర్తన, గోమాత పూజ, గణపతి గౌరీ పూజ, పంచగవ్య ప్రాసన, పూర్ణకళశ స్థాపన, ఏకవింశతి (108) కలశ స్థాపన నిర్వహించారు. వాసవి హోమం అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ అర్చకులు వారేవార్ కృష్ణ శర్మ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమం లోని 23 మంది వృద్దులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో గంప అనిల్, పోలిశెట్టి శైలేష్, పార్డీకర్ నారాయణ, లింగంపల్లి లక్ష్మీనారాయణ, పాల్దె మహేందర్, పోలిశెట్టి విలాస్, కత్తూరి శ్రీనివాస్, శక్కరి వినాయక్, తాండ్ర సుగుణాకర్, చౌడారపు సంతోష్, పడిగెల గణేష్, పూర్ణేందర్, పడిగెల శివ, వావిలాల మారుతి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.