ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
…………………………………
మహబూబ్ నగర్ జిల్లా లో చెరువులు, కుంటల పరిరక్షణ కోసం తెలంగాణ బీసీ ప్రతినిధులు నడుం బిగించారు.ఈ విషయమై
శనివారం ఈ సంఘము మహాసభ ప్రతినిధులు,జాతీయ అధ్యక్షులు మెట్టుగాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు అన్యాక్రాంతానికి, కబ్జా లకు గురవుతున్న నేపథ్యంలో వాటి పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాల్లో ఉన్న చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవుతూ నీటి వనరులు అడు గంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువులు గ్రామీణ జీవన విధానానికి, వ్యవసాయానికి ప్రాణాధారమని పేర్కొంటూ, వాటి పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. చెరువులు, కుంటల పరిరక్షణకు సంబంధించి త్వరలోనే అన్ని సంబంధిత శాఖల అధికారులతో పాటు జిల్లా కలెక్టర్తో సమావేశం ఏర్పాటు చేసి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు వారికి ఎమ్మెల్యే తెలిపారు. అలాగే అన్యాక్రాంతమైన ప్రాంతాలను గుర్తించి తొలగించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ మహాసభ జిల్లా అధ్యక్షులు కుమ్మరి రాంచంద్రయ్య, నాయకులు ముత్యం స్వామి, కనికే క్రాంతికుమార్, మహబూబ్‌నగర్ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్, మైత్రి యాదయ్య, బాలగోపి తదితరులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.