కాప్రా చెరువు సుందరీకరణకు రూ.35 కోట్లు మంజూరు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి
ముద్ర కాప్రా
కాప్రా చెరువులో రూ.35 కోట్ల లతో అభివృద్ధి, సుందరీకరణ పనులను చేపట్టనున్నట్లుగా ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
శుక్రవారం కాప్రా చెరువును పరమేశ్వర్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి సందర్శించారు.
ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్ నల్ల చెరువు రూ.20 కోట్లతో చేపట్టిన పనులు తుది దశలో ఉన్నాయన్నారు. ఇదే కాకుండా నాచారం హెచ్ఎంటీ నగర్ చెరువు రూ.30కోట్లు, రామంతాపూర్ పెద్ద చెరువు రూ.17కోట్లతో అభివృద్ధి, సుందరీకరణ పనులను చేపట్టనున్నట్లుగా చెప్పారు
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి ,స్వర్ణరాజ్ శివమణి ,సింగిరెడ్డి ధన్ఫల్ రెడ్డి కాప్రా డివిజన్ అధ్యక్షుడు కొబ్బరినూరి నాగ శేషు ,డివిజన్ అధ్యక్షులు , సీనియర్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.