Take a fresh look at your lifestyle.

పల్లె ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్….

 

అంబారిపేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం….

ముద్ర, కోరుట్ల;
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని అంబారిపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి శనివారం రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజపాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు అంబారిపేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించడం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రజల ఆరోగ్యం పరిరక్షణలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాల విస్తరణలో భాగంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అంబారిపేటతో పాటు సమీప గ్రామాల ప్రజలు కూడా ఈ కేంద్రాన్ని వినియోగించుకోవాలని కోరారు. వైద్య సిబ్బంది ప్రజలకు సానుభూతితో సేవలు అందించాలని సూచించారు.

ఈ కేంద్రంలో అవుట్ పేషెంట్ సేవలు, ప్రసూతి సేవలతో పాటు అన్ని ప్రాథమిక చికిత్సలు అందించబడతాయని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామీణ ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడంలో ఈ కేంద్రం ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో శుభ్రత, పోషకాహారం, ఆరోగ్య నియమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాగే నిత్యం వైద్యులు అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

గ్రామీణ ప్రజలకు సమీపంలోనే నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులకు అవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆరోగ్య సేవలను సమర్థవంతంగా అందించేందుకు తగిన సిబ్బంది, ఔషధాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజలు కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డిఓ జివాకర్ రెడ్డి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి సుజాత, డిప్యుటీ డీఎంహెచ్ఓ జైపాల్ రెడ్డి, తహసీల్దార్ రమేష్, ఎంపీడీవో శంకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, పాల్గొన్నారు.

కలికోట సూరమ్మ ప్రాజెక్టు పరిశీలన

కథలాపూర్ మండలం కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులను జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారితో కలిసి పరిశీలించి, త్వరలో ప్రారంభం కానున్న ఎడమ కాలువ పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్ట్ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించిన విప్, పనుల వేగాన్ని పెంచాలని అధికారులకు మరియు కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని మేడిపల్లి, భీమారం, కథలాపూర్ మండలాల రైతులకు సాగు మరియు త్రాగునీటి అవసరాలను తీర్చే విధంగా కలికోట సూరమ్మ చెరువు రూపుదిద్దుకుందన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సుమారు 43 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నట్లు అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.