ముద్ర మెహదీపట్నం : జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి పురస్కరించుకొని ప్రముఖులు నివాళులు అర్పించారు. దక్షిణ భారతదేశంలో లంగర్ హౌస్ లో ఉన్న బాపూజీ ఏకైక సమాధి వద్ద గవర్నర్ విష్ణుదేవ్ వర్మ పుష్ప గుచ్చాలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం బాపూ ధ్యాన మందిరానికి వెళ్లి అక్కడ నిర్వహించిన సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు. తదనంతరం బాపుగాట్ ప్రాంగణంలో ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. అక్కడే దేశవ్యాప్త సామూహిక మౌనంలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీకి నివాళ్ళు అర్పించిన వారిలో ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, వి హనుమంతరావు, కలెక్టర్ హరిచందన, మహేష్ భగవత్, ఉస్మాన్ హాజ్రి, చంటిబాబు తదితరులు ఉన్నారు.
