Take a fresh look at your lifestyle.

నాగపూర్ గ్రామంలో జల మహోత్సవ ర్యాలీ

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
సంగారెడ్డి మండల పరిధిలోని నాగాపూర్ గ్రామంలో సర్పంచ్ అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ఇంటింటికి మంచినీరు” పేరుతో పంచాయతీ కార్యదర్శి జగన్ నిర్వహణలో మిషన్ భగీరథ అధికారుల ఆధ్వర్యంలో జల మహోత్సవ వేడుకను గ్రామంలో తిరుగుతూ ఘనంగా నిర్వహించారు..
ఈసందర్బంగా గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన త్రాగునిరు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు, అందరికి ఆరోగ్యానిచ్చే మంచి నీటిని ఏ విధంగా అందించాలి అనే విషయాన్నీ వివరించారు, మంచినీటికి సంబందించిన అన్ని విషయాలను ఎప్పటికపుడు అన్ని రాసుకోవాలని అన్నారు.ఈ సందర్బంగా సర్పంచ్ అశోక్ గౌడ్,ఉప సర్పంచ్ ప్రకాష్ రావ్ వార్డు సభ్యులతో మిషన్ భగీరథ అధికారులు ప్రతిజ్ఞ చేయించారు.
ఈకార్యక్రమంలో సర్పంచ్ ముకురాల అశోక్ గౌడ్,ఉప సర్పంచ్ ప్రకాష్ రావ్ పంచాయతీ కార్యదర్శి జగన్
మిషన్ భగీరథ డిఈ హరీష్, ఏఈ వెంకటేష్,వార్డు సభ్యులు చింతల కీర్తన,కట్కం భాగ్యమ్మ,కాశీపూరం విజయలక్ష్మి,శ్యామల,కట్కం మధు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.