Take a fresh look at your lifestyle.

ఉద్యోగ, గెజెటెడ్ అధికారుల పెన్షనర్ల సమస్యలపై నిరసన

 

మహదేవపూర్, ముద్ర:

రాష్ట్ర ఉద్యోగ గెజిటెడ్ అధికారుల ఉపాధ్యాయుల కార్మిక మరియు పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీ శుక్రవారం ఉదయం నుండి నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై మధ్యాహ్న భోజన విరామ సమయంలో భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లో నిరసన ప్రదర్శన చేశారు. చైర్మన్ బూరుగు రవికుమార్ మాట్లాడుతూ 30 నెలలు దాటినా ఇంతవరకు పీఆర్సీ ఇవ్వలేదని, ఉద్యోగులకు ఎంప్లేయ్స్ హెల్త్ స్కీంను వెంటనే మంజూరు చేయాలని, నెలకు 1500 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఓపీఎస్ బదులు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని జేఏసీ కన్వీనర్ విజయలక్ష్మి డిమాండ్ చేశారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు ఆర్ శుభాకర్ రెడ్డి, డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, సీపీఎస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు దిల్షాద్, జిల్లా రెవిన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామ్మోహన్, పెన్షనర్ల సంఘ నాయకులు ఐలయ్య, మధుసూదన్, శ్రీనివాస్, టీఎంగోస్ జిల్లా కార్యదర్శి దశరథరామరావు, టీజీఓ కార్యదర్శి సునీల్, ఈ సమావేశంలో సభ్య సంఘాల నాయకులు జిల్లా అధికారుల పక్షాన డీఇఓ, టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క తిరుపతి , పిఆర్టియు టీఎస్ కిరణ్కుమార్, పిఆర్టియు టీజీ శ్రీనివాస్, సిపిఎస్ భార్గవ్, ట్రెస్సా నుండి శ్రీనివాస్,అహ్మద్, టిజిఓ పక్షాన డీఆర్ మధుసూదన్, శ్రీనివాసరావు, డ్రైవర్ల సంఘం నుండి శ్రీనివాస్, గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ పక్షాన రవీందర్ రెడ్డి, పెన్షనర్ల సంఘం నుండి సింగ్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నుండి శంకర్, విజయ్ టీఎన్జీఓ మహిళా ప్రతినిధులు, శ్రీదేవి, సరోజ రాణి ,ఉష, టీఎన్జీఓ నుండి షఫీసర్కార్ సురేందర్ రెడ్డి వంశీ మురళీధర్ రెడ్డి అన్వర్ బేగ్ రాజ్ కుమార్, ప్రవీణ్ కుమార్ ఎంపీడీవోల సంఘం నుండి శ్రీనివాస్ , సేవానాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.