Take a fresh look at your lifestyle.

రాత్రిపూట పోలీస్ పహారా బలోపేతం చేయండి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

 

ముద్ర, మల్కాజి గిరి

మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ సుమతి ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని శాంతి భద్రతల అంశాలపై, ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

ఉప్పల్ నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్యలు, కాలనీల్లో భద్రతా ఏర్పాట్లు, మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు, రాత్రి పహారా బలోపేతం వంటి అంశాలను ఎమ్మెల్యే కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేయాలని కోరారు.ఈ సందర్భంగా సీపీ సుమతి మాట్లాడుతూ, ప్రజల భద్రత తమ ప్రాధాన్యత అని, ఉప్పల్ ప్రాంతంలో పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంల బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండారి నీలం రెడ్డి , మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు , కాసం మహిపాల్ రెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.