Take a fresh look at your lifestyle.

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నాగర్ కర్నూల్ మండలానికి సంబంధించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను లబ్ధిదారులకు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాల ఆర్థిక భారం తగ్గించేందుకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు, మున్సిపల్ ఛైర్మన్ తీగల సునేంద్ర, వైస్ ఛైర్మన్ బాదం రమేష్, టౌన్ ప్రెసిడెంట్ జక్కా రాజు, మాజీ ఎంపీపీ కోటయ్య, పట్టణ కౌన్సిలర్లు నిజాం, అనంత అలివేలమ్మ, శంకర్, నజీమా ఇస్తాక్ అహ్మద్ ఖాన్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.