Take a fresh look at your lifestyle.

పదవి బాధ్యతలు చేపట్టిన చైర్మన్, వైస్ చైర్మన్

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన తంగెళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేష్ లు గురువారం భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్ వైస్ చైర్మన్ ఎమ్మెల్యే, ఎంపీ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భువనగిరి మున్సిపాలిటీ అభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేయాలని అన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి నిధులు కావాలన్నా మంజూరుకి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఎన్నికైన నూతన కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.