ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
గద్వాల- రాయిచూర్ జాతీయ రహదారి మార్గంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఉల్లిగప్ప (40), తిమ్మప్ప(38)లు ఐజ నుంచి బైక్ పై తమ సొంత గ్రామం దేవునిపల్లికి వెళ్తున్నారు. ఈ క్రమంలో బలిగెర గ్రామ శివారులో బైక్ ఆగి ఉన్న ట్రాక్టర్ ను ఢీ కొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. గట్టు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.