Take a fresh look at your lifestyle.

జనవరి, ఫిబ్రవరి రెండు నెలల పారితోషికాలు వెంటనే చెల్లించాలి సిఐటియు జిల్లా కార్యదర్శి కాముని గోపాలస్వామి డిమాండ్

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రూ.18,000/-ల ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలి.

 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వెతనకు 18 వేల వేతనానికి బడ్జెట్ కేటాయించి పెండింగ్లో ఉన్న జనవరి ఫిబ్రవరి నెల వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కాముని గోపాలస్వామి డిమాండ్ చేశారు.

సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 28 వేల మంది ఆశా వర్కర్లు గత 20 సంవత్సరాల నుండి పేద ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్నారన్నారు. వీరంతా మహిళలు, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే అత్యధికులున్నారని . నేటికి వీరికి ఎలాంటి చట్టబద్ధ సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గ్యారెంటీ ఫిక్సిడ్ వేతనం కూడా ఇప్పటివరకు నిర్ణయం చేయలేదు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం 2023 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు 15 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు నిరవధిక సమ్మె చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని అనంతరం వచ్చిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని తెలియజేశారనారు . కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటింది. ఈ కాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందన్నారు.అయినా నేటికి వేతనాలు పెంచలేదు. 50 లక్షల ఇన్సూరెన్స్, 50వేల మట్టి ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర హామీలు ఇచ్చినా, ఇంకా అమలు చేయటం లేదు. పి.ఆర్.సి. ఎరియర్స్, లెప్రసీ, పల్స్పాలియో, ఎలక్షన్ డ్యూటీ డబ్బులు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంటున్నాయన్నారు.. వీటికి తోడు పారితోషికాలు కూడా ప్రతి నెలా రావటం లేదు. దీంతో ఆశా వర్కర్లు అనేక ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. సమస్యలు పరిష్కారం లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శెట్టిపల్లి సత్తిరెడ్డి, అమ్ముల బాలార్సయ్య జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవి కుమార్, మామిడాల కనకయ్య యూనియన్ జిల్లా అధ్యక్షురాలు భూలక్ష్మి ప్రధాన కార్యదర్శి ప్రవీణ కోశాధికారి భాగ్యలక్ష్మి ఆశ వర్కర్లు సంతోషి శ్యామల కవిత మాలతి రేణుక భాగ్యలక్ష్మి అంజలి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.