Take a fresh look at your lifestyle.

ఓటమి గెలుపుకు నాంది – అదనపు కలెక్టర్ యం.నగేష్

ఘనంగా ముగిసిన రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ క్రీడలు
ముద్ర ప్రతినిధి, మెదక్:
క్రీడల్లో గెలుపు ఓటములు సమానమని అదనపు కలెక్టర్ మెంచు నగేష్ నగేష్ అన్నారు. ఓడిన వారు నిరుత్సాహ పడకుండా మరింత పట్టుదలతో కస్టపడి క్రీడలలో రాణించాలని పిలుపునిచ్చారు.
మెదక్ జిల్లా కేంద్రంలో నాలుగు రోజులుగా జరిగిన సెకండ్ ఎడిషన్ సీఎం కప్ -2025 సాఫ్ట్బాల్ రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు ముగిశాయి. సోమవారం ఔట్ డోర్ స్టేడియంలో ముగింపు కార్యక్రమంలో విజేతలకు అడిషనల్ కలెక్టర్ మెంచు నగేష్ బహుమతులు అందజేశారు. రమేష్ గంగాల జిల్లా యువజన, క్రీడల అధికారి రమేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నగేష్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 25 జిల్లాల నుండి సుమారుగా 700 మంది క్రీడాకారులు, 30 మంది కోచ్, మేనేజర్లు, 70 మంది వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పురుషుల విభాగంలో రంగారెడ్డి జిల్లా ప్రథమ, హైదరాబాద్ జిల్లా ద్వితీయ, జయశంకర్ భూపాలపల్లి తృతీయ, మహిళల విభాగంలో నిజామాబాద్ జిల్లా ప్రథమ, సిద్దిపేట జిల్లా ద్వితీయ, మహబూబ్నగర్ జిల్లా తృతీయ స్థానంలో నిలిచాయి.


కార్యక్రమంలో డిఈఓ విజయ జిల్లా సైన్స్ ఆఫీసర్ రాజిరెడ్డి, సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రెటరీ శోభన్ బాబు, సాఫ్ట్బాల్ ఇండియా కోచ్ కృష్ణ, అంతర్జాతీయ క్రీడాకారుడు అభిషేక్ గౌడ్, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, మెదక్ జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి శ్యాంసుందర్ శర్మ, వ్యాయామ ఉపాధ్యాయులు మాధవరెడ్డి, దేవేందర్ రెడ్డి, చంద్రమోహన్, అశోక్, ప్రభాకర్, మనోహర్, రమేష్, శంకర్, సత్యం, శ్యాం, రవి, సుజాత కుమారి, పద్మ, లతీఫా, కళ్యాణి, విజయకృష్ణ, ప్రతాప్ సింగ్, శ్రీధర్ రెడ్డి, డి.వై.ఎస్.ఓ. కార్యాలయ సిబ్బంది రాజు,మనీషా, సాయిబాబా, సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.