Take a fresh look at your lifestyle.

టర్మినేట్ అయిన 43 మంది జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ ఉద్యోగుల పునర్నియామ కానికి సింగరేణి యాజమాన్యం అంగీకారం

  • డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో గుర్తింపు కార్మిక సంఘానికి,యాజమాన్యానికి మధ్య కుదిరిన ఒప్పందం.

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: సింగరేణి సంస్థలో జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీలుగా (జేఎంఈటీ) చేరి వివిధ కారణాల తో టర్మినేట్ అయిన 43 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి సింగరేణి యాజమాన్యం సూత్రప్రాయంగా అంగీకరించింది.ఈ విషయంపై గురువారం హైదరాబాద్ విద్యానగర్ లోని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో గుర్తింపు కార్మిక సంఘం అయిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కు,సింగరేణి యాజమాన్యానికి మధ్య ఒక ఒప్పందం కుదిరింది.గతంలో ఈ జేఎంఈటీ లు విధులకు గైర్హాజరు కావడం,అవసరమైనధ్రువపత్రాలను సమర్పించకపోవడం వల్ల విధుల నుంచి తొలగించడం జరిగింది.కాగా వీరి పట్లమానవతా దృక్పథంతో వ్యవహరించి తిరిగి ఉద్యోగాలు కల్పించాలని సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ 2024 సంవత్సరం నవంబర్ లో జరిగిన డైరెక్టర్ పా స్థాయి నిర్మాణాత్మక సమావేశం లోనూ,ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో ఛైర్మన్ స్థాయిలో జరిగిన నిర్మాణాత్మక సమావేశంలోనూ అజెండా అంశంగా చేర్చి చర్చించడం జరిగింది. దీనిపై గత జూన్ 27వ తేదీన డైరెక్టర్ పా స్థాయిలో జరిగిన 51వ నిర్మాణాత్మక సమావేశంలో చర్చించి ఒక ద్వైపాక్షిక అంగీకారానికి రావడం జరిగింది. ఆ తర్వాత యూనియన్ ప్రతినిధులు,డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో మరోమారు చర్చల అనంతరం త్రైపాక్షిక ఒప్పందానికి అంగీకరించడం జరిగింది.ఒప్పందం కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) డి.శ్రీనివాసులు, సింగరేణి సంస్థ తరఫున డైరెక్టర్ (పా) గౌతమ్ పొట్రు,జీఎం సి.పి.పి. ఎ.మనోహర్,జీఎం పర్సనల్ శ్రీమతి కవితా నాయుడు,హెచ్ ఓడి (ఎంఎస్) రవి బొజ్జా,గుర్తింపు కార్మిక సంఘం తరఫున అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య,ప్రధాన కార్యదర్శి కె.రాజ్ కుమార్,నాయకులు కె.వీరభద్రయ్య,ఎం.సమ్మయ్య, మద్ది ఎల్లయ్య,వై.వి.రావు పాల్గొన్నారు.ఒప్పంద విశేషాలు టర్మినేట్ అయి పునర్నియామకం పొందుతున్న 43 మంది జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీలకు ఇది తాజా నియామకం గా గుర్తించడం జరుగుతుంది.వీరంతా సంస్థ ఏర్పాటు చేసే హై పవర్ కమిటీ ముందుకు వెళ్లితమ సర్వీసు విషయాలు,ఓవర్ మెన్ సర్టిఫికెట్,గ్యాస్ టెస్టింగ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్లు మొదలైనవి సమర్పించవలసి ఉంటుంది. అనంతరం ఆ కమిటీ సూచన మేరకు మెడికల్ ఫిట్ నెస్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. దాని ఆధారంగా ప్రాథమిక అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీ చేస్తారు.తిరిగి ఉద్యోగంలో చేరిన వీరు తమ మొదటి సంవత్సరంలో తప్పనిసరిగా కనీసం 190 మస్టర్లకు తగ్గకుండా విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.