Take a fresh look at your lifestyle.

కవితతో కలిసి గౌరవం తగ్గించుకోవద్దు

  • పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​ బీసీలకు న్యాయం చేయలేదు.
  • కేంద్రానికి పంపిన బీసీ బిల్లు ఆమోదం కోసం మోడీతో సమయం తీసుకోండి.
  • ఎంపి కృష్ణయ్యకు మంత్రి పొన్నం సూచన.

ముద్ర, తెలంగాణ బ్యూరో : బలహీన వర్గాల కోసం ఉద్యమాలు చేపట్టిన ఎంపీ ఆర్. కృష్ణయ్య.. పదేళ్లు అధికారంలో ఉండి బీసీలకు న్యాయం చేయని ఎమ్మెల్సీ కవిత వంటి వారితో భేటీలు నిర్వహించి తనకున్న గౌరవాన్ని తగ్గించుకోవద్దని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బలహీన వర్గాల కోసం విద్యార్థి ఉద్యమాలు చేపట్టిన కృష్ణయ్య అంటే మాకంతా గౌరవం ఉందన్నారు. కేంద్రానికి బీసీ బిల్లును పంపించామని దాన్ని ఆమోదింపజేసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ తీసుకోవాలని కృష్ణయ్య ను కోరారు. సోమవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 22న కృష్ణయ్యతో కవిత భేటీని ఆయన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల భేటీగా అభివర్ణించారు.కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో అమోదించిన బీసీ బిల్లుకు రాజకీయ రంగు పులమడం సరికాదని సూచించారు. పదేళ్లు అధికారంలో ఉండి బీసీల గురించి మాట్లాడని ఎమ్మెల్సీ కవితకు ఇప్పుడు బీసీలు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్న ఆయన మా ప్రభుత్వం బీసీ బిల్లును అసెంబ్లీలో అమోదింపచేసుకుని గవర్నర్ కు పంపిందని స్పష్టం చేశారు. బీసీల సంక్షేమానికి కాంగ్రెస్​ సర్కార్ చిత్త శుద్ధితో పనిచేస్తోందన్నారు. కులగణనలో భాగంగా తెలంగాణలో 56 శాతం బీసీలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించిన లెక్కలు నూటికి నూరుశాతం వాస్తవమన్నారు. బడుగుల సంక్షేమానికి నేతలందరూ రాజకీయాలకు అతీతంగా కలిసిరావాలని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.