Take a fresh look at your lifestyle.

చెడు వ్యసనాల జోలికి వెల్లవద్దని విద్యార్థుల ప్రదర్శన

గొల్లపల్లి, ముద్ర  విలేకరి : జగిత్యాల జిల్లా, గొల్లపల్లి మండల కేంద్రంలో గల  ఆదర్శ  పాఠశాలలోని విద్యార్థులు జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు గంజాయి,మాదక ద్రవ్యాలు వంటి చెడు వ్యసనాల జోలికి వెళ్లి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దనె పాట పై శుక్రవారం ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు.కాగా వీరి ప్రదర్శన చూపరులను అలరింపజేసింది  కాగా ఈ కార్యక్రమాన్ని నషా ముక్తభారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించినట్లు.ఆ పాఠశాల ప్రిన్సిపాల్ సుకరి రవి తెలియజేశారు.ప్రస్తుత పరిస్థితులలో చాలా మంది విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడి, వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని తెలిపారు.మత్తు పదార్థాల దుర్వినియోగము, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు యువత ముందుకు రావాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుంకరి రవి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.