ముద్ర, కొమురవెల్లి : మండలం లో ని అయినాపూర్ గ్రామంలో కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహాదేవని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం మహదేవుని శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను మరియు పార్లమెంట్ లో దేశంలోనే హాజరు శాతాన్ని కలిగి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తన గళాన్ని బలంగా వినిపించే నాయకుడు అని కొనియాడారు.నిత్యం ప్రజల్లో చురుకుగా ఉంటూ బడుగు బలహీన వర్గాలకు అందరికీ న్యాయం చేసే దమ్మున్న నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అని కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.