ముద్ర, తాడూర్ : తాండూర్ మున్సిపల్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కాలనీలొ నిరుపేద కుటుంబానికి చెందిన, కూలి పని చేసుకుంటూ జీవనం గడిపే వెంకటయ్య సతీమణి అకాల మరణం చెందడంతో విషయం తెలుసుకున్న నూతన కౌన్సిలర్ ఇర్షద్ అంత్యక్రియల నిమిత్తం 5,000 రూపాయలను ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డులోని నిరుపేద కుటుంబీకులు ఎవరికైనా ఏ ఆపద వచ్చినా తనకు తోచినంత సహాయం చేసి ఆదుకుంటానని భరోసానిచ్చారు. కౌన్సిలర్ సహకారానికి కాలనీవాసులు ధన్యవాదాలు తెలియజేశారు.