Take a fresh look at your lifestyle.

సౌమ్య కుటుంబానికి జాగృతి అండ- జాగృతి అధ్యక్షురాలు కవిత

గుంపుమేస్త్రికి ప్రధాన గూఢచారి సంతోష్ రావు
ఆయనకు శిక్షపడుతుందనే నమ్మకం లేదు 
పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పని చేయాలి
ఈ దుర్మార్గుడికి కేటీఆర్, హరీశ్ రావు వత్తాసు
గంజాయి, డ్రగ్స్ ముఠాలకు తగిన గుణపాఠం చెప్పాలి 
సౌమ్య కుటుంబానికి జాగృతి అండ
జాగృతి అధ్యక్షురాలు కవిత
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ఎదుర్కొంటోన్న మాజీ ఎంపీ సంతోష్ రావు గుంపుమేస్త్రీకి ప్రధాన గూఢచారి అని జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సంతోష్ రావు ను సిట్ పిలవటం మంచిదే అన్న ఆమె కానీ ఆయనకు శిక్ష పడటం అనుమానమేనని అభిప్రాయపడ్డారు. తాను గతంలో చెప్పిన దయ్యాల్లో మొదటి దయ్యమే సంతోష్ రావు అని మండిపడ్డారు. ఇంతటి దుర్మార్గుడికి కేటీఆర్, హరీష్ రావు ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అర్థం కావటం లేదన్నారు. గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడి… హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబ సభ్యులను కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు కేసీఆర్ దూరం కావటానికి కారణం సంతోష్ రావేనని ఆరోపించారు. గద్దర్ లాంటి నాయకులు గంటలు గంటలు గేట్ బయట వేచి చూడటం, ఈటల లాంటి ముఖ్య నేతలు పార్టీ నుంచి బయటకు రావటానికి కూడా సంతోష్ రావే కారణమని చెప్పారు. కేసీఆర్  ఫార్మ్ హౌస్ లో సగం ఇడ్లి తిన్నారా? పూర్తిగా ఇడ్లి తిన్నారా? అన్న సమాచారాన్ని కూడా గుంపు మేస్త్రీ సీఎం రేవంత్ రెడ్డికి చేరవేసేది ఆయనే అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో తన గూఢచారికి శిక్షపడకుండా రేవంత్ రెడ్డి కాపాడుకునే పరిస్థితి ఉందన్నారు. నిజంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే కచ్చితంగా సంతోష్ రావు అనే  దుర్మార్గుడికి శిక్ష పడుతుందన్నారు. పోలీసులు కూడా రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా తమ పని తాము చేయాలని విజ్ఞప్తి చేశారు. కనీసం ఈ కేసుతోనైనా ఉద్యమకారులను కేసీఆర్ కు దూరం చేసిన పాపం ఈ దుర్మార్గుడికి తగులుతుందన్నారు.
తాము అధికారంలో వస్తే… రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి లేకుండా చేస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ నేతలు… గద్దెనెక్కిన తర్వాత ముఖం చాటేశారన్నారు. దురదుష్టమేమిటంటే గ్రామాల్లో కూడా గంజాయి, డ్రగ్స్ ఫ్రీ గా దొరికే పరిస్థితి వచ్చిందన్నారు. నిమ్స్ లో చికిత్స  పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబాన్ని పరామర్శించినట్లు చెప్పారు. ఆమె పరిస్థితి కొంచెం విషమంగా ఉన్నప్పటికీ కాస్త ఇంప్రూమెంట్ ఉందన్నారు.  సౌమ్య కుటుంబానికి జాగృతి తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ ను చంపే ధైర్యం గంజాయి బ్యాచ్ చేసిందంటే ప్రభుత్వం అంటే వారికి ఏ మాత్రం భయం లేదని స్పష్టమవుతోందన్నారు. స్కూల్ లోకి కూడా గంజాయి, డ్రగ్స్ తీసుకొచ్చి పిల్లలను పాడు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో ఆడవాళ్లే బాధితులుగా మారే పరిస్థితి ఉంఃదన్నారు. హహింస ఘటనలు జరగటానికి డ్రగ్స్, గంజాయి కారణమవుతోందని చెప్పారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మత్తు వదిలి డ్రగ్స్, గంజాయి మాఫియా పై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. అలాగే ఎక్సైజ్, ఫారెస్ట్ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలన్నారు. శిక్షణలో గన్ ఫైరింగ్ లో ప్రతిభకనబర్చినా ప్రభుత్వం మాత్రం వారికి ఆయుధాలు ఇవ్వడం లేదన్నారు. వారి వద్ద వెపన్స్ ఉంటే గంజాయి, డ్రగ్స్ మాఫియాకు కాస్త భయం ఉంటుందన్నారు. డ్రగ్స్, గంజాయి మహమ్మరిని తరిమికొట్టేందుకు జాగృతి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్, గంజాయి ముఠాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.