Take a fresh look at your lifestyle.

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి: నేచురలిస్ట్ శ్వేత

 

నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి:
విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని నేచురలిస్ట్ మరియు తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యూనిట్ మేనేజర్ శ్వేత సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ఆమె మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. “ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది” అని పేర్కొన్నారు. విద్యార్థులు ఎదురయ్యే అవాంతరాలను అధిగమిస్తూ చదువును మధ్యలో ఆపకుండా పూర్తి చేసి, మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు.

అనంతరం ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఘనంగా ఫేర్వెల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ విద్యార్థులు తమ అనుభవాలను జూనియర్‌లతో పంచుకోగా, విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు.

కళాశాల ప్రిన్సిపాల్ మదన్మోహన్ మాట్లాడుతూ విద్యార్థులు చదువు పూర్తయ్యాక ఎక్కడ ఉన్నా ఉన్నత స్థాయిలో ఎదగాలని గురువుల ఆకాంక్ష అని తెలిపారు. కష్టపడి మంచి స్థాయికి చేరుకొని తల్లిదండ్రులు, గురువులకు పేరు తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ఏవో మొహమ్మద్ ఇర్ఫాన్, అధ్యాపకులు అంజయ్య, వనిత, కోదండరాములు, రామకృష్ణ, దశరథం, ముజఫర్, శోభారాణి, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.