Take a fresh look at your lifestyle.

పహల్గాంలో జరిగిన ఘటనలో మృతులకు నివాళులు

కోరుట్ల, ముద్ర విలేకరి: కాశ్మీర్ లోనీ పహల్గాంలో జరిగిన హింసాత్మకమైన సంఘటనకు నిరసనగా శనివారం రోజు శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో చనిపోయిన వారికి మట్టి ప్రమిదలతో నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు యతిరాజం నర్సయ్య మాట్లాడుతూ ఈ దేశంలో ఉంటూ, దేశంపై విషం చిమ్ముతూ, పరదేశాన్ని ప్రేమిస్తూ, దేశాన్ని వ్యతిరేకించే మతోన్మాద శక్తులు ఎవరైనా దేశద్రోహులే, అలాంటి వారి పట్ల ప్రభుత్వo కఠిన నిర్ణయం తీసుకొని శిక్షించాలని అన్నారు. ప్రభుత్వం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు నేతి శ్రీనివాస్, కటకం దివాకర్, చిలువేరి విజయ్, కోట గంగాధర్, గోడికే రాములు, చిట్యాల పద్మ, అర్చకులు బీర్నంది నరసింహాచారి జూనియర్ అసిస్టెంట్ పెడివెల్లి నర్సయ్య పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.