ముద్ర, తాండూర్:
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో ఇటీవలే నూతనంగా ఎన్నికైన ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కోట మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి శ్రీ కోట్రీక కిరణ్ కుమార్, అలాగే 24 వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గా గెలుపొందిన బాలకృష్ణారెడ్డి గారిని ద్వారకా నగర్ కాలనీవాసులు శ్రీశ్రీశ్రీ పరమాత్మ నందా స్వామివారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గీత సత్సంగ్ సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ దేవగారి రమేష్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీ కౌకుంట్ల వాసు, ఉపాధ్యాయులు ప్రభాకర్ రెడ్డి, సోమనాథ్, కాలనీవాసులు, తదితరులు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.