Take a fresh look at your lifestyle.

బడ్జెట్ అంతా అంకెలగారడి – మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

 
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………….
కాంగ్రెస్ సర్కార్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ అంకెలగారడీగా ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. శనివారం పాలమూరు లో ఆయన మీడియా సమావేశం లో మాట్లాడుతూ. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నీ వర్గాలను నిరాశపరిచిందన్నారు.
మూడవ బడ్జెట్లో కూడా ప్రభుత్వం సంక్షేమం పథకాలపై ఎక్కువ ద్రుష్టి పెడుతుందని ఆశించిన వారికి నిరాశ మిగిల్చిందన్నారు.బడ్జెట్ లో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు.. 11 డిక్లరేషన్ లకు అనుగుణంగా బడ్జెట్ రూపాకల్పన లేదన్నారు. బీసీలకు ఏడాదికి రూ. 20 వేల కోట్లు.. ఐదేండ్లకు లక్షకోట్లు ఇస్తామని ప్రకటించి ఇప్పుడు కేవలం 3.85 శాతం మాత్రమే కేటాయించారని ఆయన మండిపడ్డారు. బీసీ గురుకులాల్లో అన్నం సరిగ్గా లేక విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారని, మైనారిటీ గురుకులాల్లో వసతులు లేక ఖాళీ అవుతున్నాయన్నారు. సీపీఎస్ రద్దు చేస్తామని ప్రభుత్వం మాట తప్పిందని, పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాలు సరిగ్గా ఇవ్వడం లేదని ఆరోపించారు. పదవి విరమణ పొందిన వారికీ వారికి ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదన్నారు.అన్నం పెట్టె రైతు ఇబ్బందుల్లో ఉన్నాడని,.రైతు భరోసా ఇవ్వడం లేదన్నారు. కరెంటు సరిగ్గా లేదు..సకాలంలో యూరియా అందించక్ పోవడం తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,పండించిన తరువాత కనీసం గిట్టుబాటు ధర ఇవ్వడం లేదన్నారు.బీ ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులు, గురుకులాలు, మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ అస్పత్రులు పెద్ద మొత్తంలో అభివృద్ధి చేసి రాష్ట్ర సంపద పెంచినమని, ప్రజల ఆస్తుల విలువ కూడా పెంచామన్నారు.బీసీ లకు రూ.50 వేల కోట్లు ఇవ్వాల్సిందేని, దళితుల అభివృద్ధి కోసం రూ.10 లక్షలు బడ్జెట్ లో కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.ఇవ్వాల్సిందే.
రాష్టాన్ని తిరోగమానంలోకి నెట్టే బడ్జెట్ ఇదని,అంకెల గారడీ తప్ప సంక్షేమ బడ్జెట్ కాదన్నారు.అన్నీ పార్టీలు రాజకీయాలకు అతీతంగా అన్నీ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందె బడ్జెట్ రూపాకల్పన చేసేందుకు ప్రభుత్వం పై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు.ఈ సమావేశంలో మైనారిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్స్, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
…………………………………….

Leave A Reply

Your email address will not be published.