గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి-CITU జిల్లా సహాయ కార్యదర్శి చొప్ప రవికుమార్ డిమాండ్
* అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో జీవో. నెం. 51ని సవరణ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు కోరుతూ తీర్మానం చేయాలి
సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :
గ్రామపంచాయతీకార్మికులకు ఇచ్చిన మెమోనో రద్దు చేయాలని ప్రభుత్వమే గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికుల ఖాతాలో జీతాలు వేయాలని ఈ బడ్జెట్ సమావేశాలలో ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్ప రవికుమార్ డిమాండ్ చేశారు. శనివారం సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు క్యాంపు కార్యాలయంలో ఆఫీస్ ఇన్చార్జికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలను పంచాయతీ నిధుల ద్వారా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం మార్చి2వ తేదీన ఇచ్చిన సర్క్యులర్ ను రద్దు చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని సిబ్బంది 2వ పిఆర్సి పరిధిలోకి తీసుకురావాలన్నారు., అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా జీవో నెం.51 సవరణ చేసి మల్టీపర్పస్ వర్కర్స్ విధానం రద్దు కోరుతూ తీర్మానం చేయాలని, ఆన్లైన్లో నమోదు కానీ కార్మికుల పేర్లను తక్షణమే నమోదు చేయాలి డిమాండ్ చేశారూ.. కారోబార్ బిల్ కలెక్టర్ల స్పెషల్ స్టేటస్ కల్పించాలన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచుల వేధింపులు అధికమవుతున్నాయని కార్మికుల తొలగింపులపైన చర్యలు చేపట్టాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలన్నారు.
ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని మల్టీపర్పస్ వర్కర్స్ విధానం వల్ల గ్రామాల్లో అనేక పనులు చేయిస్తున్నారు. కావున సమస్యలను పరిష్కరించాలని ఆందోళన పోరాటాలు చేస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అమ్ముల బాల్ నర్సయ్య తునికి మహేష్ కోశాధికారి చిట్యాల కనకయ్య, గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా నాయకులు రాజనర్సయ్య, పిల్లి రవీందర్, కనకయ్య యాదగిరి మల్లయ్య కనకయ్య లక్ష్మీ కనకవ్వ బాల్ నర్సవ్వ కళావతి తదితరులు పాల్గొన్నారు.