Take a fresh look at your lifestyle.

జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్‌ విలీనం జరగాల్సిందే..మంత్రి పొన్నం ప్రభాకర్

ఎమ్మెల్యే గణేష్ చేస్తున్న దీక్షకు మద్దతు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ చేస్తున్న దీక్షకు హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ మద్దతు తెలిపారు. కంటోన్మెంట్ విలీనానికి సంబంధించి కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు లేఖలు రాస్తూ వెంటనే విలీనానికి సంబంధించిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ప్రకటన విడుదల చేశారు. అభివృద్ధి సమానంగా జరగాలని కంటోన్మెంట్ పేరుతో జరుగుతున్న వివక్ష పై చేస్తున్న దీక్షకు మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం త్వరగా తీసుకోవాలని కంటోన్మెంట్ ప్రజల సమస్యలు తీర్చేలా విలీనం త్వరగా జరపాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.