Take a fresh look at your lifestyle.

వడియరాజుల సొసైటీకీ శుభాకాంక్షలు తెలిపిన గాంధీ

మాదాపూర్, ముద్ర విలేఖరి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ కాలనీ కి చెందిన వడియరాజులు సొసైటీ సంఘం కు నూతనంగా ఎన్నుకోబడిన నూతన కార్యవర్గ సభ్యులు పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను శాలువతో సన్మానించి, అభినదించిన చైర్మన్ ఆరెకపూడి గాంధీ.ఈ సందర్భంగా ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ వడియరాజులు సొసైటీ సంఘం నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియచేశారు. అదేవిధంగా వడియరాజులు సొసైటీ సంఘం సభ్యులు సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, మీరు నివసిస్తున్న కాలనీల లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని,కాలనీ మరియు సంఘం అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని , ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి గాని తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని,నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ వడియరాజులు సొసైటీ సంఘం సభ్యులు ఎల్లవేళాలో అందుబాటులో ఉంటూ సమస్యల పై స్పందిస్తూ ,ప్రతి ఒక్కరు సమిష్టిగా కలిసి సంఘం మరియు కాలనీ అభివృద్ధి కి పాటుపడాలని ఒక ఆదర్శవంతమైన సంఘం గా తీర్చిదిద్దే క్రమం లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చైర్మన్ గాంధీ తెలియచేసారు.ఈ కార్యక్రమంలో నాయకులు సాంబయ్య వడియరాజులు సొసైటీ సంఘం ప్రెసిడెంట్ దుర్గారావు, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, సెక్రెటరీ కొండల్ రావు, జాయింట్ సెక్రటరీ మధు, ట్రెజరర్ శ్రీనివాసులు, ఎక్జిక్యూటివ్ మెంబర్లు బాలాజీ, వెంకటేశ్వరరావు మరియు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.