Take a fresh look at your lifestyle.

తెలంగాణా అవకాశాల గని. అపారమైన టాలెంట్ పూల్ మా బలం- ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.

• తెలంగాణాలో ఏఐ పరిశోధలు, ఆవిష్కరణలకు ప్రభావశీలమైన టాలెంట్ పూల్ ఉందని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
• శుక్రవారం నాడు ఆయన ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఏఐ సమ్మిట్ లో స్వీడెన్ వాణిజ్య ప్రతినిధులు, కృత్రిమ మేథ నిపుణులు పలు దేశాల ప్రభుత్వ ఉన్నతాధికారులను ఉద్దేశించి ప్రసంగించారు.
• ప్రభుత్వ సేవల్లో ఏఐ వినియోగం, వాతావరణ స్థితిస్థాపకత అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు.
• కృత్రిమ మేథ వెల్లువ వల్ల ఎదురయ్యే సవాళ్లను, అది తీసుకువచ్చే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మా ప్రభుత్వం ముందే సంసిద్ధమైంది.
• దానికి తగ్గట్టుగా సాఫ్ట్ వేర్ నిపుణుల నైపుణ్యాలు పెంచే కార్యక్రమాలు ప్రారంభించాం.
• ఏఐ విస్తృతితో ఉద్యోగ విధుల్లో గణనీయమైన మార్పులు వస్తాయి. అందుకు అవసరమైన సన్నధను మొదలు పెట్టింది మా ప్రభుత్వమే.
• యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఏఐ యూనివర్సిటీలు ఇందులో భాగమే.
• ఏఐ పరిశోధన కేంద్రాలు, అప్లికేషన్లు, సేవల వల్ల కొత్త ఉద్యోగాలు ఫుట్టుకొస్తాయి. యువత దీనిని అందిపుచ్చుకోవాలి.
• యువత, వృత్తి నిపుణులు మరింత సృజనాత్మక బాధ్యతలు చేపట్టేందుకు ఏఐ అపారమైన అవకాశాలను సృష్టిస్తుంది.
• స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్ అనేది రెండేళ్లుగా మేం మంత్రంలా జపిస్తున్నాం.
• ప్రభుత్వ సేవలు, సంక్షేమ కార్యక్రమాల్లో ఏఐ వినియోగం వల్ల లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెరుగుతుంది. దుర్వినియోగానికి ద్వారాలను మూసివేస్తుంది. ఇందుకు అవసరమైన అప్లికేషన్లను రూపొందించడం, నూతన ఆవిష్కరణలను చేపట్టేందుకు గ్లోబల్ టెక్ కంపెనీలు ముందుకు రావాలి.
• కృత్రిమ మేథ ఫలాలను ప్రజలందరి వద్దకు చేర్చేందుకు ప్రతి గ్రామానికి ఇంర్నెట్ కనెక్టివిటీని అందించే బృహత్తర యజ్ణం ఇప్పటికే మొదలైంది. టీ- ఫైబర్ ప్రతి గ్రామాన్ని ప్రంపచంతో కనెక్ట్ చేసేందుకు రెండేళ్లుగా శ్రమిస్తోంది.
• ఏఐ విధ్వంసక శక్తి కానే కాదు. అదో గేమ్ ఛేంజర్. దాన్ని మచ్ఛిక చేసుకోవాలి. మన నైపుణ్యాలకు పదును పెట్టుకుని దానిని నియంత్రణలోకి తెచ్చుకోవాలి.
• పెట్టుబడులకు తెలంగాణా స్వర్గధామం లాంటిది. కొత్తదనానికి రాష్ట్రం ఎప్పుడూ స్వాగతం పలుకుతూ ఉంటోంది.
• దీనికి అనుకూలమైన ఎకోసిస్టంను రాష్ట్రంలో అభివృద్ధి చేశాం. నిరంతర విద్యుత్తు సరఫరా, స్థిరమైన విధానాలు అమలు చేస్తున్నాం.

Leave A Reply

Your email address will not be published.