ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళిక లో బాగంగా
కొండపాక మండల కేంద్రం లో పశువైద్యశాల ఆవరణలో రైతు వారోత్సవాల్లో పశువైద్య శిబిరం నిర్వహించారు. ఆవులకు , గేదెలకు గర్భకోశ సంబంధ చికిత్సలు నిర్వహించారు. అలాగే రైతులకు వేసవిలో పశువులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించటం జరిగింది. 75%సబ్సిడీ పై పశుగ్రాసం విత్తనాలు పంపిణీ చేయటం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నవీన DAO స్వరూపరాణి, DVAHO గోపాల కృష్ణ మూర్తి, విజయ డెయిరీ DD నాగేశ్వరరావు , Dr. శ్రీకాంత్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.