Take a fresh look at your lifestyle.

వరి ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం.. తాటికొండ సీతయ్య బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు

 

ముద్ర, తుంగతుర్తి…
వరి ధాన్యం కొనుగోలు కల్లాల్లో ధాన్యం పోసి నెల రోజులుదాటినా ఇప్పటివరకు పావు వంతు ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించలేదని ధాన్యం సేకరణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. గురువారం తుంగతుర్తిలో విలేకరులతో మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలు సక్రమంగా రాకపోవడం. లోడింగ్ చేసి పంపిన లారీ మిల్లుల వద్ద సకాలంలో దిగుమతులు కాపోవడం వల్ల రైతులకు ఎదురుచూపులు తప్పక ధాన్యం కల్లాల వద్ద పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇది ఇలా ఉంటే ములిగే నక్క పై తాటిపండు పడ్డ చందంగా మిల్లు యజమానులు తరుగు పేరుతో తాలు పేరుతో కిలోల కొద్ది వరి ధాన్యం కోతలు పెడుతుండడం తో రైతు పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం లో అగమ్య గోచరంగా మారింది అని అన్నారు. గత పదేళ్ల కెసిఆర్ పాలనలో ఎలాంటి ఇబ్బంది పడకుండా రైతులు ధాన్యం అమ్ముకున్నారని రైతు కళ్ళల్లో ఆనందం కనిపించేదని కానీ నేడు రైతు కళ్ళల్లో ఆవేదన కనిపిస్తోందని అన్నారు. కాంగ్రెస్ ను నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిందని రైతులు నెత్తి నోరు బాదుకుంటున్నారని అన్నారు. ఓ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలార మీరు అధికారానికి వచ్చిన రెండున్నర ఏండ్లు గా రైతుకు సంబంధించిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకపోతీరని అన్నారు. రైతు భరోసా సక్రమంగా ఇవ్వక పోతిరి రైతు బీమా రద్దు చేస్తిరి రుణ మాఫీ నీటి మూట అయిందని అన్నారు. కనీసం పంట వేసుకుంటే యూరియా సరిగా ఇవ్వక ఇబ్బందుల పాలు చేశారని పండిన పంటను సరిగా కొనుగోలు చేయక పోవడం లాంటి మీఅస్తవ్యస్త మైన దివాళా కోరు పాలన విధానాలతోవ్యవసాయ రంగం పూర్తిగా ఊబి లో కూరుకుపోయిందని అన్నారు. రైతాంగం తో పాటు సమాజం లోని అన్ని వర్గాలప్రజలను దివాళా తీయించి హాయిగా అధికారంలో కులుకుతున్నారని రైతులు ఇంత గగ్గోలు పెడుతున్న ఎమ్మెల్యేలు గానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ ఏ ఒక్కా వరి ధాన్యం కేంద్రాన్నైన సందర్శించి రైతుకు భరోసా కల్పించారా ?అని ప్రశ్నించారు..విద్యార్థులకు సంబంధించిన నీట్ పరీక్ష పేపర్ లీక్ అవ్వడం వలన 22లక్షల మంది విద్యార్థులు ఈరోజు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది అని 12 ఏండ్ల కేంద్ర బీజేపీ పాలనలో ఇప్పటికీ నాలుగు సార్లు పేపర్ లీకేజీ వల్ల విద్యార్థులు నష్ట పోతున్న బీజేపీ ప్రభుత్వం నేరస్థుల పై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించలేదని అన్నారు. ఇందుకు నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని లీకేజీ లో బాధ్యులైన అందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని. నష్ట పోయిన విద్యార్థులకు కేంద్రం తగు న్యాయం చేయాలని డిమాండ్ చేసారు. తుంగతుర్తి పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం పార్టీ నాయకులు ఉప్పల నాగమల్లు మాజీ సర్పంచ్ యాకు నాయక్ ,పూర్ణ నాయక్, రాములు నాయక్ ,నల్లబెల్లి వెంకటేష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.