Take a fresh look at your lifestyle.

వన్ డే వన్ వార్డు‘ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన పీయేసీ ఛైర్మన్

ముద్ర, శేరిలింగంపల్లి:
చందానగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ స్టేడియంలో జరిగిన వన్ డే వన్ వార్డ్ కార్యక్రమంలో భాగంగా కాలనీలలో నెలకొన్న పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ ఐఏఎస్ అధికారి జి.సృజన, జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ మాలెంపాటి, డీసీ శ్రీమతి శశిరేఖ, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి మరియు సీఎంసీ పలు విభాగాల అధికారులు, కాలనీల రేసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో కలిసి సమీక్షా సమావేశం జరిపిన పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్బంగా పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ వన్ డే వన్ వార్డ్ కార్యక్రమంలో భాగంగా కాలనీల రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అధికారులతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. కాలనీ వాసులు పలు సమస్యలను మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులను నా దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. రాబోయే వర్షాకాలం లోపు అసంపూర్తిగా మిగిలిపోయిన నాలల విస్తరణ చేపట్టాలని, నాల పూడిక తీతే కాకుండా నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడలని అధికారులకు సూచించారు. ప్రథమ ప్రాధాన్యతగా భవానిపురం నాలా విస్తరణ పనులు వెంటనే చేపట్టాలని, వేమన కాలనీ, సురక్ష, శంకర్ నగర్ కాలనీ లలో పార్క్ ల అభివృద్ధి మరియు సుందరీకరణ చేపట్టాలని, పనులలో ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి కాలనీ లో పార్క్ లను అభివృద్ధి చేయాలని, ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని చైర్మన్ గాంధీ కమిషనర్ కు సూచించారు.

ఈ సమావేశంలో సీఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఈఈ శిరీష, డీఈ శ్రీదేవి, ఏఈ ప్రశాంత్, ప్రతాప్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏసీపీ రాణి, టీపీఎస్ రమేష్, అసిస్టెంట్ డైరెక్టర్ స్పోర్ట్స్ విరనంద్, డీఈ వశీధర్ మరియు నాయకులు, కార్యకర్తలు, కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రూ.15,37,500ల సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ:
రూ.15,37,500ల పది హేను లక్షల ముపై ఏడు వేల ఐదు వందల రూపాయల సీఎంఆర్ ఎఫ్ చెక్కులను 41 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసిన చైర్మన్ ఆరెకపూడి గాంధీ. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా 41 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన మొత్తాన్ని తాజా మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి బాధిత కుటుంబాలకి అందచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాయి నేనీ చంద్రకాంత్ రావు, చంద్రమోహన్ సాగర్, నవీన్ రెడ్డి, రవి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.