Take a fresh look at your lifestyle.

సేవకు ప్రతిరూపం నర్సింగ్ వృత్తి

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
సేవాభావానికి ప్రతిరూపం నర్సింగ్ వృత్తి అని నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రోగుల పట్ల అత్యుత్తమమైన సేవలను అందించే వృత్తి నర్సింగ్ వృత్తన్నారు. అలాంటి వృత్తిలోకి నిర్మల్ జిల్లా కేంద్రంలోని కళాశాల నుండి దాదాపు 120 మంది అతి అడుగు పెట్టబోతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ రాజేందర్ డిప్యూటీ డి ఎం హెచ్ ఓ పవన్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శకుంతల, కౌన్సిలర్ రాజు, కొండాజీ రాఘవేంద్ర చారి లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.