- సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు
- సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జబ్బర్
ముద్ర,వీపనగండ్ల: ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని,గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పార్టీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని గోపాల్ దీన్నే లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.దీక్షలో కూర్చున్న వారికి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జబ్బర్ పూలదండలు వేసి దీక్షలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎం.డి జబ్బర్ మాట్లాడుతూ గ్రామంలో స్థానిక సమస్యలను పరిష్కరించాలని,ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు 20% మాత్రమే బోనస్ డబ్బులు వేయడం జరిగిందన్నారు,ఇంకా 80 శాతం రైతులకు బోనస్ ఇవ్వకపోవడం వల్ల ఆందోళన గురవుతున్నారని,వెంటనే బోనస్ డబ్బులను రైతు అకౌంట్లో జమ చేయాలని,ఇంకా 40 శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు.రైతు భరోసా మూడో ఎకరాల వరకు వేశామని చెబుతున్న ముఖ్యమంత్రి,ఇంకా 25% పైగా రైతులకు రైతు భరోసా మూడే ఎకరాల్లోకి ఉన్నవారికి కూడా రాలేదని,ప్రతి రైతుకు రైతు భరోసా అమలు చేయాలన్నారు.గోపాల్ దిన్నకు లింకుగా ఉన్న గ్రామాలకు బీటీ రోడ్లు వేసి,గ్రామానికి ఒకే బస్సు వస్తుందని ఇంకా అదనంగా రెండు బస్సులు వేసి రవాణా సౌకర్యం మెరుగుపరచాలని అన్నారు.357 సర్వేనెంబర్ లో గ్రామానికి చెందిన దళిత,బిసి వారికి భూమి చూపించి,పట్టాలు ఇవ్వాలని,అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు,రేషన్ కార్డులు, పింఛన్లు, ఆత్మీయ భరోసా పథకాలు అమలు చేయాలన్నారు.కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బాల్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకులు పెద్దఖాజా, గ్రామ నాయకులు శేఖర్ రెడ్డి, వెంకటయ్య, నిరంజన్,భాస్కర్, చంద్రయ్య,రాముడు, కురుమయ్య, కృష్ణయ్య, శ్రీనివాసులు, మౌలాలి, వెంకటేశు, నాగన్న, తిరుపతయ్య తదితరులు ఉన్నారు.