ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ ని తెలంగాణ హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు సద్ది వెంకట్ రెడ్డి శుక్రవారం సాయంత్రం డిజిపి కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా హోటళ్ల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సప్తగిరి, వేణుగోపాల్, తాజ్ మహల్ చంద్ర శేఖర్, సుప్రభాత్ కృష్ణ మూర్తి, రామమూర్తి, గండేశ్వర్ రావు, రాధా కృష్ణ పాల్గొన్నారు
