. ఫలించిన ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి కృషి.
. హర్షం వ్యక్తం చేసిన తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి.

ముద్ర, తాండూర్:
ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ ప్రాంతానికి వెళ్లడానికి సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు దాదాపుగా 10 సంవత్సరాలుగా ట్రైన్ నిలుపుదల కోసం చేసిన ప్రయత్నం నేడు ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఫలితంగా నెరవేరింది. వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గ పరిధిలోని బషీరాబాద్ మండలం నవంద్గీ రైల్వే స్టేషన్ లో తాండూర్ రైల్వే స్టేషన్ కు 20 కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల ఇక్కడ హుబ్లీ ట్రైన్ ఆపేవారు కాదు. ఎన్నో ఏళ్లుగా బషీరాబాద్ ప్రాంత ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు ఎన్నోమార్లు రైల్వే అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు, విద్యార్థుల చదువుల నిమిత్తం, వ్యాపారాల కోసం ఈ ప్రాంత ప్రజలకు ట్రైన్ సదుపాయం కల్పించాలని, ఎన్నికల సమయంలో ప్రజా ప్రతినిధులకు, అధికారులకు వేడుకున్నారు. ఎట్టకేలకు శుక్రవారం రోజున ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, కృషి ఫలితంగా ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. ట్రైన్ నిలుపుదల కోసం కృషిచేసిన కొండ విశ్వేశ్వర్ రెడ్డి ని స్థానిక శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లడుతూ ఎంపీ ఎన్నికల సమయంలో ఈ ప్రాంత ప్రజలకు హుబ్లీ ట్రైన్ నిలుపుదలకు కృషి చేస్తానని మాట ఇవ్వడం జరిగిందని, తద్వారా వారి కృషి ఫలించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందని, ముఖ్యంగా సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీకి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు ధన్యవాదాలు తెలిపారు. నేటి నుండి ఈ ప్రాంత ప్రజలకు సమయపాలన తగ్గి, డబ్బు ఆదా అవుతుందని, అలాగే ప్రయాణికుల సౌకర్యం కూడా పెరుగుతుందనిఆయన తెలిపారు. ప్రయాణికుల సంతోషార్థం స్థానిక శాసనసభ్యులు మనోహర్ రెడ్డి తో పాటు ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి స్థానిక నేతలతో కలిసి నవంద్గీ రైల్వే స్టేషన్ నుండి తాండూర్ వరకు ట్రైన్ లో ప్రయాణించారు. కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.