ముద్ర,వీపనగండ్ల : ప్రముఖ భారత శాస్త్రవేత్త నోబుల్ గ్రహిత సివి రామన్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించార.పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు 35 సైన్స్ ప్రయోగాలను సొంతంగా తయారు చేసి ప్రదర్శించారు,ఈ ప్రయోగాలను ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తిలకించారు.అశోక్ అనే విద్యార్థి సెన్సార్ వాటర్ సిస్టం ప్రయోగాన్ని, గౌతమ్ అనే విద్యార్థి మంకీ గన్, చందు అనే విద్యార్థి ఎలక్ట్రానిక్ బెల్,మనోజ్ అనే విద్యార్థి మైక్రోస్కోప్ ద్వారా మొక్కల ఆత్మనిర్మాణాలను ప్రదర్శించటం చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భాను ప్రకాష్ మాట్లాడుతూ విద్యార్థుల మేధో శక్తిని పెంపొందించడానికి సైన్స్ ప్రయోగాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.విద్యార్థులు సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని,కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని దానికి అనుగుణంగా విద్యార్థులు చదవాలన్నారు.విద్యతోనే బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. సైన్స్ ప్రదర్శన అనంతరం విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన,క్విజ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు.ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మహేష్, మహిపాల్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, శ్రీనివాసు, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
