- నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి కోట నాయక్
ముద్ర ప్రతినిధి, మహబూబ్ నగర్: క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరకదారుడ్యానికి ఎంతో ఉపయోగపడతాయని నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి కోట నాయక అన్నారు.శుక్రవారం ఎదిర గ్రామంలో నెహ్రు యువ కేంద్రం సహకారంతో జనరంజని కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ వాలీబాల్ పోటీలను నిర్వహించారు.ఈ పోటీలలో కబడ్డీకి సంబంధించిన నాలుగు టీంలు,వాలీబాల్ సంబంధించిన 8 టీం లు పాల్గొన్నాయి.ఈ కార్యక్రమంలో కోట నాయక్ మాట్లాడుతూ,క్రీడాకారులు చక్కటి ప్రతిభను కనబరిచి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని,యువకులు క్రీడలు సామాజిక కార్యక్రమంలో పాల్గొనాలని గ్రామ అభివృద్ధికి అదేవిధంగా దేశాభివృద్ధికి పాటుపడాలని కొనియాడారు.నేటి యువకులే రేపటి దేశానికి భావి పౌరులుగా వెన్నెముకగా ఉంటారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులందరూ శారీరక దేహ దారుఢ్యాన్ని కలిగి ఉండాలని తెలియజేశారు.నెహ్రు యువక కేంద్రం యువకుల కోసం అనేక కార్యక్రమాలను గ్రామీణ యువకుల కోసం వారి అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేస్తుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో జనరంజని కల్చరల్ అసోసియేషన్ డైరెక్టర్ రవిశంకర్,మహబూబ్ నగర్ రూరల్ ఏఎస్ఐ ఖాజామైనుద్దీన్, మాజీ కౌన్సిలర్ టి యాదమ్మ,హనుమంతు,శివశంకర్,మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రాములు,సూర్య,నర్సింలు,అల్లి ఎల్లయ్య, కోట్ల వెంకటయ్య గౌడ్,సత్యం,నర్సింలు,శ్రీశైలం,అశోక్ గౌడ్,రాష్ట్ర కార్మిక నాయకుడు అంబదాస్,రాఘవేందర్ గౌడ్,బి రాములు, బి శ్రీనివాసులు,నరేష్, ఆంజనేయులు, విజయ్ నరేష్ పెద్ద కృష్ణ కర్నే కృష్ణ,కాశన్న,ఏదిరా గ్రామం యువజన సంఘాల సభ్యులు అధ్యక్ష కార్యదర్శులు యువకులు తదితరులు పాల్గొన్నారు.