Take a fresh look at your lifestyle.

అందరకీ… ఒక్కో ఎకరానికి.. రైతు భరోసా నిధుల విడుదల వేళ ట్విస్ట్ పంపిణీ లో ఈసారి కీలక మార్పులు

 

ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఎట్టకేలకు రైతుల నిరీక్షణ ఫలించింది. రైతు భరోసా నిధుల జమకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఇదే సమయంలో నిధుల విడుదలలో కీలక మార్పులు చేసింది. ఈ సారి నిధుల విషయంలో అర్హతల ఆధారంగా జమ అవుతాయని స్పష్టం చేస్తున్నారు. అదే విధంగా ఈ సారి తొలి విడతలోనే రైతులందరీ అకౌంట్లో డబ్బులు పడేలా కొత్త నిర్ణయం అమలు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. తెలంగాణలో రైతులకు రైతు భరోసా నిధుల విడుదలకు రంగం సిద్దం చేస్తున్నారు. ఈ సారి రైతు భరోసా నిధుల విడుదలలో కీలక మార్పులు చేసారు. తొలి విడతలోనే లబ్దిదారులందరికీ డబ్బులు అందనున్నాయి. ఇప్పటివరకు ఎకరం భూమి ఉన్న రైతుల నుంచి మొదలుపెట్టి విడతల వారీగా ఎక్కువ పోలం ఉన్న రైతులందరికీ నిధులు జమ చేసేవారు. దీని వల్ల ఏడెనిమిది విడతల్లో డబ్బులు జమ చేయడం వల్ల ఎక్కువ భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అంటానికి చాలా ఆలస్యమవుతోంది. అయితే ఈ సారి ఈ విధానానికి రేవంత్ సర్కార్ స్వస్తి పలికింది. ఇక నుంచి పెట్టుబడి సాయం విడుదల చేయడంలో కొత్త విధానాన్ని పాటించాలని నిర్ణయించింది. ఈ సారి తొలి విడతలోనే రైతులందరీ అకౌంట్లో డబ్బులు పడేలా కొత్త నిర్ణయం అమలు చేయనున్నారు. తొలి విడతలో ఎకరం భూమికి రైతు భరోసా అకౌంట్లలో జమ చేయనుంది. అంటే ఎంత భూమి కలిగి ఉన్నవారికైనా.. తొలి ఎకరానికి రూ.6 వేలు తొలి విడతలో జమ చేసేలా మార్గదర్శకాలు సిద్దం చేస్తన్నారు.

రైతు భరోసా నిధుల విడుదల పై తాజా నిర్ణయం
ఎకరాకు మించి ఎంత పొలం ఉన్నా.. తొలి ఎకరానికి రూ.6 వేలు జమ చేస్తారు. దీని వల్ల లబ్ది దారులందిరికీ ఒకేసారి లబ్ది చేకూరనుంది. మిగతా ఎకరాలకు విడతల వారీగా డబ్బులు జమ చేస్తారు. ఈ నెల 22వ తేదీన సీఎం రేవంత్ నర్మెట్టలో జరిగే కార్యక్రమంలో ఎకరం భూమికి రైతుల ఖాతాల్లో నిధులు విడుదల చేయనున్నారు. మొదటి విడతలో 70 లక్షల మంది రైతులకు నిధులు జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం రూ.3,590 కోట్లు ఖర్చు కానుంది. ఇక తొలి విడత జమ చేసిన 20 రోజుల తర్వాత రెండో విడత సొమ్ము, ఏప్రిల్ నెలాఖరుకల్లా మూడో విడత నగదు జమ చేస్తారు. మూడు విడతల్లోనే ఈ సారి నగదు జమ చేసే ప్రక్రియ పూర్తి కానుంది. కాగా.. రైతు భరోసా కొత్త దరఖాస్తులను కూడా అర్హుల నుంచి ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఫిబ్రవరి 2026లోగా కొత్తగా పట్టాదారు పాస్ బుక్ పొందిన రైతులందరూ దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. స్థానిక రైతు వేదికలు, రైతు విస్తరణ అధికారుల వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.