Take a fresh look at your lifestyle.

శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వాముల మరణం తీరని లోటు-మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు

 

ధర్మపురి చరిత్రలో మహాస్వాముల వారి పేరు నిలిచే విధంగా చర్యలు

ధర్మపురిలో నివాళ్లు ఆర్పించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు..

ధర్మపురి :

ధర్మపురి మఠాధీశులు శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వాముల వారు శివైక్యాం (మరణం) తీరని లోటని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు అన్నారు. శ్రీశ్రీశ్రీ సచ్చిదానంత సరస్వతి మహాస్వాముల వారు శుక్రవారం శివైక్యాం చేయగా ధర్మపురిలోని శ్రీలక్ష్మినర్సింహాస్వామి వద్ద స్వామి వారికి ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు మంత్రి గారితో కలిసి నివాళ్లు అర్పించారు.

ఈసందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వాముల వారు శివైక్యాం ధర్మపురి శ్రీలక్ష్మినర్సింహస్వామి ఆలయానికి తీరని లోటని అన్నారు. ధర్మపురి క్షేత్రంలో చేసే ప్రతి కార్యక్రమంలో స్వామి వారి ఆలోచనతో ముందుకు సాగామని మంత్రి అన్నారు. ధర్మపురి బ్రహ్మోత్సవాల నుంచి మొదలుకొని శివ కల్యాణం, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇలా ప్రతి కార్యక్రమానికి స్వామి సూచన ప్రకారం ముందుకు సాగామని మంత్రి అడ్లూరి అన్నారు.

మహాస్వాముల వారి ఆధ్వర్యంలో గతంలో వారి స్వామి వారి కల్యాణం చేశామని గుర్తు చేశారు. ధర్మపురి క్షేత్రంలో వారి పేరు చిరస్ధాయిగా నిలిచిపోయే విధంగా ప్రభుత్వం తరుపున అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. కొన్ని కారణాల వలన తాను అంతిమ యాత్రకు హాజరు కాలేకపోతున్నప్పటి తన కుమారుడిని పంపించినట్లు మంత్రి తెలిపారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకురాలని కోరుకుంటున్నట్లు మంత్రి వివరించారు.

Leave A Reply

Your email address will not be published.