- హైదరాబాద్ ఇన్ ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్
- కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి రిజర్వాయర్ ప్రారంభం
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ నగర అభివృద్ధి చేపడుతున్నామని హైదరాబాద్ ఇన్ ఛార్జీ, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.నగర తాగు నీటికి సంబంధించి కావల్సిన మౌలిక సదుపాయాలు, ఆర్ధిక చేయూత కోసం కేంద్రం సహకరించాలని కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని రహమత్ నగర్, బోరబండ డివిజన్ ప్రజల దాహార్తిని తీర్చడానికి ఎస్ఆర్ఆర్ హిల్స్ లో రిజర్వాయర్ ను శనివారం కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించినారు.ఈ సందర్భంగా గేట్ వాల్ తిప్పి నీటిని విడుదల చేశారు.అనంతరం యూసుఫ్ గూడ లో రూ. 75 లక్షలతో అండర్ గ్రౌండ్ నాలా ఆధునికీకరణ కు శంకు స్థాపన చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని రహమత్ నగర్ ,బోరబండ డివిజన్ లో 18 వేల కుటుంబాలకు అర్దరాత్రి మూడు రోజులకు ఒకసారి వచ్చే నీటి సమస్యలకు చెక్ పెడుతూ 5.75 కోట్లతో నిర్మించిన రిజర్వాయర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూహైదరాబాద్ నగర అభివృద్ధి కి రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నామని తెలిపారు. 2015 లో 8 లక్షల నల్ల కలెక్షన్స్ ఉంటే గత పదేండ్లలో 13.80 లక్షల కనెక్షన్లు పెరిగాయని తెలిపారు.గడిచిన పదేండ్లలో కొత్త లైన్ వేయకపోవడంతో హైదరాబాద్ ప్రజలు నీటి కొరత తో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నీటికి వినియోగానికి సంబంధించి గతంలో కృష్ణ ,గోదావరి నుండి వచ్చే నీరు తప్ప ఒక్క ఎమ్ ఎల్ వాటర్ కూడా సప్లై చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 7400 కోట్లతో 20 టీఎంసీ ల నీటిని నగరానికి తీసుకొచ్చే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిందన్నారు.త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. మూసి క్లీనింగ్ రూ. 3800 కోట్లతో 39 ఎస్ టి పి లు త్వరలోనే ప్రారంభం కానున్నాయన్నారు. పాతబస్తీలో రూ. 301 కోట్లతో సివరేజ్ పనులు ప్రారంభం చేశామని తెలిపారు.రాబోయే కాలంలో నగరం పెరుగుతున్న దృశ్య తాగునీటి సమస్య పరిష్కారం చేయడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడుగా సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం తరుపున గతంలో కోరామన్నారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఇన్చార్జి అజహరుద్దీన్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, సిఎన్ రెడ్డి,బాబా ఫసియుద్దిన్ ,వాటర్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు అధికారులు పాల్గొన్నారు.