- ప్రణయ్ ను తల్వార్ తో నరికిన A 2 సుభాష్ శర్మ కు ఉరి శిక్ష ఖరారు
సూర్యాపేట, ముద్ర ప్రతినిధి: సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసు కు సంబంధించి సోమవారం నల్లగొండ జిల్లా కోర్టు జడ్జి రోజా రమణి సంచలన తీర్పు విలువరించారు.ప్రణయ్ ను చంపడానికి డబ్బులు తీసుకుని కాంట్రాక్టు కుదుర్చుకున్న నిందితులను విచారించిన కోర్టు ఈ మేరకు సోమవారం తీర్పును వెలువరించింది.ఈ మేరకు నిందితుల్లో A2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి ప్రకటించారు.అదేవిధంగా కేసులో ఏ3 గా అస్గర్ అలీ, ఏ4 గా అబ్దుల్ బారి, ఏ5గా కరీం, ఏ6 గా శ్రవణ్, ఏ 7 గా శివ, ఏ8గా నదీమ్లకు జీవిత ఖైదును విధించారు. కాగా, మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం విదితమే.2018 జనవరిలో అమృత, ప్రణయ్ ఇద్దరు కులాంతర ప్రేమ వివాహం చేసుకోగా ఇది నచ్చని అమృత తండ్రి మారుతీ రావు తట్టుకోలేక ప్రణయ్ హత్యకు సుపారీ ఇచ్చాడు.2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రి వద్ద మాటు వేసిన నిందితులు ప్రణయని అతి కిరాతకంగా చంపారు.ఇదే విషయంపై మిర్యాలగూడ 1 టౌన్లో ప్రణయ్ తండ్రి పెరుమల్ల బాలస్వామి ఫిర్యాదు చేశారు.
అయితే, పోలీసులు మొత్తం 8 మందిపై కేసు నమోదు చేశారు.20205 అమృత చేసుకున్నాడు. తండ్రి ఆత్మహత్యకు ఐదేళ్ల పాటు కొనసాగిన వాదోపవాదల అనంతరం ఇవాళ నిందితుల్లో ఒకరికి ఉరి శిక్ష, ఆరుగురికి జీవిత ఖైదు విధిస్తూ నల్లగొండ 2వ అదనపు సెషన్స్ కోర్టు తుది తీర్పును వెలువరించింది.నిందితులకు 302, 120, 109, 1989 ఐపీసీ, 1959 ఇండియన్ ఆర్మ్ యాక్ట్ ప్రకారం న్యాయమూర్తి శిక్షను ఖరారు చేశారు.ఈ క్రమంలోనే తమకు శిక్ష తగ్గించాలని నిందితులు న్యాయమూర్తిని వేడుకున్నట్లుగా తెలుస్తోంది.