వీసీ తక్షణమే రాజీనామా చేయాలి : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో విద్యార్థులు, అధ్యాపకులపై జరిగిన అమానుష దాడిని ఎస్‌ఎఫ్‌ఐ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ భువనగిరిలోని ప్రిన్స్ చౌరస్తా వద్ద ఎస్‌ఎఫ్‌ఐ భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సుందరయ్య భవనంలో జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అండతోనే క్యాంపస్‌లలో ఏబీవీపీ గూండాలు స్వైరవిహారం చేస్తున్నారని మండిపడ్డారు. ముసుగులు ధరించి విద్యార్థినుల హాస్టళ్లలోకి చొరబడి, ఇనుప రాడ్లతో దాడి చేయడం పిరికిపంద చర్య అని విమర్శించారు. ప్రశ్నించే గొంతుకలను హింసతో అణచివేయలేరని, విద్యార్థి లోకం ఈ దాడులను ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. విద్యార్ధి నాయకుల బహిష్కరణ ఎత్తివేయాలి, విద్యార్థులు తమ విద్యార్ధి సంఘాన్ని ఎన్నికల తమ ప్రతినిధులను ఎన్నుకున్నారని వి.సి.ని వైఖరిని ప్రశ్నించినందుకు వారిని క్యాంపస్ నుండి బహిష్కరణ చేయడం దుర్మార్గపు చర్య తక్షణమే వారిపై బహిష్కరణ ఎత్తివేయాలి లేకపోతే దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చింతల శివ, లావుడియా రాజు ఉపాధ్యక్షులు వేముల నాగరాజు, ఈర్ల రాహుల్ , తిగుల్ల శ్రీనివాస్ , ధరావత్ జగన్ నాయక్, సహాయ కార్యదర్శులు ఇందు రాణి,పుట్టల ఉదయ్ పాల్గొన్నారు.