హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి ఫిబ్రవరి 23:
కెపిహెచ్బి కాలనీ వసంత నగర్ డివిజన్ పరిధిలోని బుద్ధాస్ వర్డెక్స్ క్లాసిక్ (Buddhas Vardex Classic) అపార్ట్‌మెంట్స్‌లో మందలపు రోజారాణి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సౌజన్యంతో జరిగిన ఈ శిబిరంలో సుమారు 250 మందికి పైగా మహిళలు, పురుషులు పరీక్షలు చేయించుకున్నారు.
ఈ సందర్భంగా బసవతారకం హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ప్రేరణ మాట్లాడుతూ, క్యాన్సర్ పట్ల భయం కంటే అవగాహన ముఖ్యమని పేర్కొన్నారు. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చని, తద్వారా సరైన వైద్యంతో వ్యాప్తిని అరికట్టవచ్చని ఆమె సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మందలపు రోజారాణి ఛారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులతో పాటు
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వైద్య బృందం
సీనియర్ కాంగ్రెస్ నాయకులు
బుద్ధ హోమ్స్ కాలనీవాసులు
మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు.