Take a fresh look at your lifestyle.

మంథని మార్కెట్ కమిటీ చైర్మన్ గా కుదుడుల వెంకన్న

మంథని, ముద్ర విలేకరి: మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కుదుడుల వెంకన్న, వైస్ చైర్మన్ గా ముక్కుల ప్రశాంత్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మంథని మండలం వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన కుడుదుల వెంకన్న ఎంపీటీసీగా పని చేసిన అనుభవంతో పాటు సుధీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్‌ నాయకుడిగా కొనసాగుతున్నారు. రెండేళ్ల పాటు ఈ కమిటీ కొనసాగుతుందని పేర్కొన్నారు. అలాగే సభ్యులుగా మంథని సదానందం, కన్నెబోయిన ఓదెలు, ఎండీ అంకూస్, రేగల్ల రామ్మోహన్, ఉదరి శంకర్, గడ్డం పోచయ్య, అజ్మీరా చందునాయక్, పన్నాల ఓదెలు, దూలం సులోచన, లింగంపల్లి నర్సింగ్ రావు, రావికంటి వెంకటేష్, ఎల్లంకి శంకర్ లింగంతో పాటు మలహర్ మండల పీఏసీఎస్ ఛైర్మన్, జిల్లా మార్కెటింగ్ అధికారి, మంథని వ్యవసాయ శాఖ ఏడీ, మంథని మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ లను సభ్యులుగా ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఎంపికపట్ల పలువురు కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.