Take a fresh look at your lifestyle.

మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేస్తాం – ఎస్పీ జానకి షర్మిల

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లాలో మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు యంత్రాంగం కృత నిశ్చయంతో ఉందని ఎస్పీ జానకి షర్మిల స్పష్టం చేశారు.
ప్రజా ప్రణాళిక 99 రోజుల
కార్యక్రమంలో భాగంగా గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై జిల్లాలో కఠిన చర్యలు చేపడుతున్నామని ఎస్పీ జి.జానకి షర్మిల, తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో “గాంజా గస్తీ” బ్యానర్‌ను ఆవిష్కరించారు. జిల్లాలో గాంజా వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలుతీసుకుంటున్నా మన్నారు. జిల్లా వ్యాప్తంగా గాంజా వినియోగం, రవాణా, విక్రయాలపై కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయడంతో పాటు, ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువతను గాంజా వంటి మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
ఎక్కడైనా గాంజా విక్రయాలు, వినియోగం జరుగుతున్నట్లు తెలిస్తే తమకు సమాచారాన్ని అందించాలని కోరారు. వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు.

Leave A Reply

Your email address will not be published.