Take a fresh look at your lifestyle.

అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

రాయికల్, ముద్ర విలేకరి: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఒడ్డే లింగాపూర్ గ్రామంలో గిరిజన సంక్షేమ మినీ గురుకులం పాఠశాలలో 40 లక్షల నిధులతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్.మినీ గురుకులం ను హై స్కూల్ గా అప్గ్రేడ్ చేయాలని వినతి పత్రాన్ని అందజేసిన గ్రామనాయకులు,సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అప్గ్రేడ్ కు కృషి చేస్తానని అన్నారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాయికల్ మండలం అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని అన్నారు.రాయికల్ మండలం బోర్నపల్లి జగన్నాధ పూర్ వంతెన ఇక్కడి ప్రజల చిరకాల కోరిక కాబట్టి బోర్న పల్లి బ్రిడ్జి నిర్మాణానికి ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి వారితో మాట్లాడడం జరిగిందని తెలిపారు.ఆర్టికల్ 275 క్రింద కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపించామని త్వరలోనే బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు అవుతాయని అన్నారు.ప్రజలకు నిరంతరం సేవ చేయడానికి రాజకీయాలలోకి వచ్చానని ప్రజలకు అవసరమైన ప్రతి పనికి రాజకీయాలతో సంబంధం లేకుండా అందరినీ కలుస్తూ పనులు చేస్తున్నానని అన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే అని అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు.గిరిజనుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపేందుకు 12,600 కోట్లతో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకం,గిరిజన రైతులకు సాగునీరందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు ఎమ్మెల్యే.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చిరంజీవి, ఇంఛార్జీ ఎమ్మార్వో గణేష్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ మోర హనుమండ్లు, సీనియర్ నాయకులు కోల శ్రీనివాస్, రవీంధర్ రావు, గన్నెరాజిరెడ్డి, అనుపురం శ్రీనివాస్, పడిగల రవీంధర్ రెడ్డి, అచ్యుత్ రావు, మాజీ సర్పంచ్ రవి, పిఏసిఎస్ వైస్ ఛై ర్మన్ మల్లయ్య, యం. ఏ ముఖీ ద్,దుబ్బ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్,తిరుపతి గౌడ్,గ్రామ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.