Take a fresh look at your lifestyle.

శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న మంత్రి అడ్లూరి..

ముద్ర, గొల్లపల్లి:

గొల్లపల్లి మండలం వెనుగుమట్ల – బొంకూర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో మంత్రి గారికి స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు అడిగి తెలుసుకున్నారు.

జాతరకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని మంత్రి ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ఈనెల 23 నుండి 25వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.