Take a fresh look at your lifestyle.

జగిత్యాలలో దారుణం…

సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్ పై ఆటో డ్రైవర్ దాడి…
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

తనకు సైడ్ ఇవ్వలేదని కోపంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై ఆటో డ్రైవర్ దాడి చేసిన సంఘటన జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. టౌన్ ఎస్సె సుప్రియ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ డిపో నుంచి నిజామాబాద్ కి శుక్రవారం విధుల్లో భాగంగా ఆర్టీసీ డ్రైవర్ మహమ్మద్ జలీల్ బస్సు తీసుకొని వచ్చాడు. జగిత్యాల పట్టణంలోకి రాగానే ఆటో డ్రైవర్ ముసుకు ప్రదీప్ వెనుక వైపు నుంచి హారన్ కొట్టాడు. అయితే ఆటోకి సైడ్ ఇవ్వలేదని కొత్త బస్టాండ్ ప్రాంగణంలోకి వచ్చి బస్సు డ్రైవర్ ని బూతు మాటలు తిడుతూ, చేతులతో బలంగా కొట్టాడని ఆర్టీసీ డ్రైవర్ జలీల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సె సుప్రియ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.