ముద్ర : మల్కాజిగిరి
మెరుగైన వైద్య సేవలు పొందేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ను అర్హులైన వారు సద్వినియోగపరచుకోవాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు.
మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధి కు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే స్వయంగా లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా మొత్తం 9 మందికి చెక్కులు పంపిణీ చేయబడగా, మొత్తం ఆర్థిక సహాయం విలువ రూ. 3,72,000, విలువగల చెక్కులను పంపిణీ చేశారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుందని తెలిపారు. అవసరమైన ప్రతి అర్హుడికి సహాయం అందేలా తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, డోలి రమేష్, తదితరులు పాల్గొన్నారు.