ముద్ర, గద్వాల:
ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర బిజెపి పార్టీ ఆదేశాల మేరకు సోమవారం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో బీజేపి నాయకులు ర్యాలి నిర్వహించి, అయా తహసీల్దార్ కార్యాలయాలో వినతి పత్రం అందజేశారు. బిజేపీ జిల్లా అధ్యక్షుడు, మండలాధ్యక్షుడు టి.శ్రీనివాసులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీలను నెరవేర్చాలని గద్వాల తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం హామీలు తక్షణమే అమలు చేయాలనీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగిందని, కానీ వాటిలో ఏ ఒక్క హామీ కూడా ఇప్పటివరకు పూర్తిగా అమలు కాలేదు అని ఆరోపించారు. ముఖ్యంగా యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, పెన్షన్స్ , కల్యాణ లక్ష్మి ,పేదల గృహ నిర్మాణ పథకం, రైతులకు రైతు భరోసా, భూ సమస్యల పరిష్కారం వంటి అనేక హామీలు అమలు పరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో ప్రజలు దరఖాస్తులు సమర్పించినప్పటికీ వారి సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు అని, ఆ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. నివాస ఆదాయం మరియు కుల ధ్రువీకరణ పత్రాల జారీలు తీవ్ర జాప్యం జరుగుతోంది ద్రువీకరణ పత్రాలు జారీ చేసి అర్హులు నష్టపోకుండా చూడాలి అని కోరారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి మండల పరిధిలోని ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరారు.